గురువారం 03 డిసెంబర్ 2020
Nagarkurnool - Nov 01, 2020 , 03:14:46

వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి

వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆత్మనిర్భర్‌ పథకం ద్వారా ఇస్తున్న రుణాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శనివారం కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మెగా రుణ క్యాంపు నిర్వహించారు. ఆత్మ నిర్భర్‌ నిధి పథకం ద్వారా 798 మంది వీధి వ్యాపారులకు రూ.79.80లక్షలు పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆత్మ గౌరవంతో జీవించాలనే లక్ష్యంతో రుణాలు అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం కల్వకుర్తిలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు తలసాని జనార్దన్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, కౌన్సిలర్లు శ్రీశైలం, శ్రీనివాసులు, మనోహర్‌రెడ్డి, బాలు, డీఏవో వెంకటేశ్వర్లు, శ్రీధర్‌, రాకేశ్‌, తిరుపతయ్య, షానవాజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు