గురువారం 03 డిసెంబర్ 2020
Nagarkurnool - Nov 01, 2020 , 03:14:46

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: భారతీయ సనాతన ధార్మిక స్థాపన మహర్షి వాల్మీకి ద్వారా జరిగిందని, ఆయన జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. శనివారం వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో వెనకబడిన తరగతులు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్లు మనుచౌదరి, హనుమంతురెడ్డి హాజరై మాట్లాడారు.  ధర్మం, సత్యం, సోదరభావం, ప్రజాపాలన రామాయణంలో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయన్నారు. ఈ గ్రంథానికి వాల్మీకి రూపకర్త అని అన్నారు. హనుంతురెడ్డి మాట్లాడుతూ మనిషి పుట్టుకతోనే పితృరుణం, దేవరుణం, రుషి రుణం ఉంటాయని, రుషికి ఎంత రుణపడి ఉండాలో సనాతన ధర్మం వివరిస్తుందన్నారు. మానవుడు రుషికి పుట్టుకతోనే రుణపడి ఉండాలన్నారు. అలాంటి రుషుల్లో రామాయణ రూపకర్త వాల్మీకి మహర్షి అని అన్నారు. రామాయణం కేవలం ఒక కావ్యం కాదని, మానవ జీవితానికి దిక్సూచి లాంటిందని అన్నారు. రామాయణాన్ని ఆచరిస్తే సమాజంలో పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు ఉండవన్నారు. కార్యక్రమంలో వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి అనిల్‌ప్రకాశ్‌, పీఆర్‌ఈఈ దామోదర్‌రావు పాల్గొన్నారు.

అప్పాజిపల్లిలో..

తిమ్మాజిపేట: మండలంలోని అప్పాజిపల్లిలో శనివారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వాల్మీకి ఆలయం వద్ద వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తిరుపతమ్మ, బీజేపీ మండల అధ్యక్షుడు యశ్వంత్‌, ఉప సర్పంచ్‌ బాల్‌రాజ్‌, జల్లి రమేశ్‌, నర్సింహ, స్వాతి, ఆరీఫ్‌పాషా, కిరణ్‌కుమార్‌, ఎల్లయ్య, సుందరయ్య, కురమయ్య, శ్రీకాంత్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బిజినేపల్లిలో..

బిజినేపల్లి : రామాయణ చరిత్ర వ్యాసకర్త వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను మండలంలోని మంగనూరులో శనివారం వాల్మీకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి యువక బృందం ఆధ్వర్యంలో కాషాయ జెండాలతో గ్రామంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.