గురువారం 03 డిసెంబర్ 2020
Nagarkurnool - Nov 01, 2020 , 03:14:49

48 మీటర్లు నీటి తోడివేత

48 మీటర్లు నీటి తోడివేత

  • ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌ వద్ద కొనసాగుతున్న డీవాటరింగ్‌

కొల్లాపూర్‌ : మండలంలోని ఎల్లూరు సమీపంలో ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌ -1 పంప్‌హౌస్‌ నుంచి నీటి తోడివేత కొనసాగుతున్నది. పంప్‌హౌస్‌ నుంచి భారీ మోటర్ల ద్వారా శనివారం వరకు 48 మీటర్ల నీటిని తోడివేశారు. మరో మూడు మీటర్లు నీటిని తోడివేస్తే తప్ప మోటర్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించేందుకు వీలుపడదని ఇంజినీరింగ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పంప్‌హౌస్‌లో ఐదు మోటర్లు నీటిలో తేలినప్పటికీ.. అడుగు భాగంలో మరో మూడు మీటర్లు నీటిని తొలగించాల్సి ఉన్నది. కాగా, సాంకేతిక లోపాలను గుర్తించడానికి రావాల్సిన బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ ఇంజినీరింగ్‌ బృందం షెడ్యూల్‌ను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.