శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 30, 2020 , 02:04:31

నిరాటంకంగా నీటి తోడివేత

   నిరాటంకంగా నీటి తోడివేత

కొల్లాపూర్‌ : మండలంలోని ఎల్లూరు సమీపంలో ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌ -1 పంప్‌హౌస్‌ నుంచి నీటి తోడివేత కొనసాగుతున్నది. గురువారానికి 44 మీటర్ల నీటిని తోడివేశారు. ఏడు మీటర్ల నీటిలోనే మూడో మోటరు విడిభాగాలు భారీగా ధ్వంసమైనట్లు ఇంజినీరింగ్‌ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ప్రాజెక్టు, పటేల్‌ కంపెనీ ఇంజినీర్ల పర్యవేక్షణలో సహాయక చర్య లు నిరాటంకంగా జరుగుతున్నాయి. ఇంకా 7 మీటర్ల నీటిని తొలగిస్తే బే స్మెంట్లు తెబ్బతిన్నాయా లేదా అని గుర్తించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నిపుణుల బృందం రానున్నట్లు సమాచారం. మూడో మోటరు విడిభాగాలకు ఎంత నష్టం వాటిల్లింది.. వినియోగంలోకి వస్తాయా లేదా అని బృందం తేల్చనున్నది.