శనివారం 05 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 30, 2020 , 01:47:06

‘ధరణి’తో మార్పునకు శ్రీకారం

‘ధరణి’తో మార్పునకు శ్రీకారం

  • నిమిషాల వ్యవధిలోనే మ్యుటేషన్‌తోపాటు పాసుపుస్తకాలు జారీ..   
  • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
  • కల్వకుర్తిలో ‘ధరణి’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి రూరల్‌: సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి వైబ్‌సైట్‌తో నూతన మార్పునకు శ్రీకారం చుట్టాడని ఎమ్మెల్యే జై పాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ధరణి వె బ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎ మ్మెల్యేకు ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, తాసిల్దార్‌ రాంరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ.. ధరణి వెబ్‌సైట్‌ ఫలితంగా నూతనంగా భూమిని కొనుగోలు చేసి న వారికి తాసిల్దారే జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ గా స్లాట్‌ బుక్‌ చేసి నిమిషాల వ్యవధిలో మ్యు టేషన్‌తోపాటు కొత్త పాసుపుస్తకాన్ని జారీ చేస్తారన్నారు. గతంలో భూములు కొనుగోలు చేసిన వారు పాస్‌పుస్తకం కోసం కార్యాలయా ల చుట్టూ కొన్ని నెలల పాటు తిరగాల్సి వచ్చేదని..

ధరణి పోర్టల్‌తో ఆ సమస్యలకు చెక్‌ ప డినట్లు ఎమ్మెల్యే వివరించారు. నిజాం పాలనలో ‘జమాబందీ’ నిర్వహించారని తిరిగి 105 ఏండ్ల తర్వాత రెవెన్యూ శాఖలో మార్పు లు చేసినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌ ప్రారంభంతో యావత్‌ తెలంగాణ ప్రజలు హర్షం వ్య క్తం చేస్తున్నారని.. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ధరణి వెబ్‌సైట్‌ పనితీరును పరిశీలించారు. కా ర్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహేద్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బాలయ్య, ఎంపీపీ సునీత, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు ఉన్నారు.