ఆదివారం 29 నవంబర్ 2020
Nagarkurnool - Oct 29, 2020 , 03:15:04

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌దే గెలుపు

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌దే గెలుపు

వంగూరు: ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు హమీద్‌ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్లకు బీజేపీ ప్రలోభాలకు గురి చేసేందుకు ఏర్పాటు చేసుకున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నా వారు నిస్సిగ్గుగా టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్ని కుట్రలకు పాల్పడినా అంతిమ విజయం టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.