శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 28, 2020 , 02:09:17

డెంగీ కేసులుమాయం..

డెంగీ కేసులుమాయం..

కందనూలు : వానకాలంలో రోగాల భయం వెంటాడుతున్నది. పిల్లల నుంచి పెద్దల వరకు అస్వస్థతకు గురవుతూనే ఉంటారు. కానీ ఈ ఏడాది వానకాలం ప్రారంభం నుంచి జిల్లాలో ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా తీసుకుంటున్న జాగ్రత్తలే శ్రీరామరక్షగా మారాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జాగ్రత్తలే కారణం..

ప్రజల్లో పెరిగిన వ్యక్తిగత పరిశుభ్రత. 

కరోనా కారణంగా ఇండ్లల్లో కొవిడ్‌ను అరికట్టే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం.

అధికారుల సూచనలు పాటించడం.

తరచూ వేడి నీటితో ఆవిరి పట్టడం, కషాయం తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మందులు వాడకం.

ప్రభుత్వం ప్రతి కాలనీలో పారిశుధ్య చర్యలు చేపట్టడం.

రోగాలపై నిత్యం అధికారులు అప్రమత్తం చేస్తుండడం.

కొత్తగా కేసులు  రావడం లేదు..

గతేడాదితో పొలిస్తే ఇప్పుడు సాధారణ జ్వరాలు మినహాయిస్తే కొత్త కేసులు రావడం లేదు. ప్రతిసారి వానకాలంలో డెంగీ, టైఫాయిడ్‌, మలేరియా తదితర వ్యాధులతో దవాఖానలు నిండిపోయేవి. చిన్నపాటి వర్షం వస్తే దోమలు, ఈగలు, బొద్దింకలు నివాసాలు ఏర్పరుచుకొని రోగాలు వ్యాప్తి చెందేవి. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల్లో వచ్చిన మార్పు కారణంగా డెంగీ కేసులు రావడంలేదు.

- దశరథం, నాగర్‌కర్నూల్‌ మండల వైద్యాధికారి.