శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 27, 2020 , 04:37:23

ఎడమగట్టు ఉపకేంద్రం పునరుద్ధరణ

ఎడమగట్టు ఉపకేంద్రం పునరుద్ధరణ

  • 1, 2 యూనిట్లకు పూర్తైన మరమ్మతులు
  • ప్రారంభించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ 
  • మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్లాంట్‌లో రోజుకు మూడు వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతున్నది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం సీఎండీ ప్రభాకర్‌రావుతో కలిసి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. అనంతరం శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే ప్లాంట్‌ పునరుద్ధరణ జరుగడం పట్ల ఇంజినీర్లపై  అభినందనలు వెల్లువెత్తాయి.

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ/శ్రీశైలం : శ్రీ శైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ వెలుగులు విరజిమ్మనున్నాయి. రెండు నెలల కాలంలోనే ప్లాంట్‌ పునరుద్ధరించారు. దీంతో ప్లాంట్‌లో రోజుకు మూడు వందల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనున్నారు. సోమవారం విద్యుదుత్పత్తిని విద్యు త్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎం డీ ప్రభాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. 

రెండు యూనిట్లు ప్రారంభం

ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో ఆగస్టు 20 వ తేదీన జరిగిన ప్రమాదంలో ప్లాంట్‌ను కాపాడే యత్నంలో ఇంజినీర్లు, ఇతర సిబ్బంది కలిపి తొ మ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిం దే. దీంతో అప్పటి నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ స్పందించి ప్లాంట్‌ పునరుద్ధరణ చర్యలకు, విచారణ, తదుపరి చర్యల కోసం సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ప్లాంట్‌ పునరుద్ధరణకు నాటి నుంచి ప్రభుత్వంతోపాటు ఇంజినీర్లు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు వారి కృషి ఫలించడంతో వారం, పది రోజుల నుం చి ట్రయల్న్‌ నిర్వహిస్తున్నారు. ట్రయల్న్‌ విజయవంతం కావడంతో సోమవారం విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుదుత్పత్తిని ప్రారంభించా రు. ప్లాంట్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉండగా, ఇందులో ప్రస్తుతం 1, 2వ యూనిట్లు పునరుద్ధరణకు నోచుకోగా.. ఒక్కో యూనిట్‌ నుంచి 150 మె గావాట్ల చొప్పున రోజూ 300 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనున్నారు. ఇక 3,5,6 యూనిట్ల మరమ్మతులను వేగవంతం చేశారు. ఈ ప్రక్రియను వ చ్చే మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు ఇం జినీరింగ్‌ అధికారులు శ్రమిస్తున్నారు. ప్లాంట్‌లో జ రిగిన ప్రమాదంలో ముఖ్యమైన నాలుగో యూనిట్‌ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ యూనిట్‌ రిపేర్‌ పనుల్లో మరింత జాప్యమయ్యే అవకాశం ఉన్నది. నాల్గో యూనిట్‌ను వచ్చే ఏడాది మే నెలలోగా ప్రారంభించేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది.

కాగా, ఈ ప్రమాదం వల్ల ప్లాంట్‌లో తీవ్రంగా నష్టం జరిగిందన్న ప్రతిపక్షాల ఆరోపణలు వదంతులుగా ఇం జినీర్లు పేర్కొంటున్నారు. అధికంగా కేబుల్స్‌ కాలిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. కేబుళ్లతోపాటు ఆయిల్‌ ఛేంజ్‌ వంటి పనులే ఇందులో చేపట్టారు. దీనికి దాదాపుగా రూ.కోటి వరకు ఖర్చు అయ్యినట్లు అంచనా. కాగా 3,5,6 యూనిట్లలో న ష్టం స్వల్పంగానే ఉందని భావిస్తున్నారు. ప్రమాదం లో బాగా దెబ్బతిన్న నాలుగో యూనిట్‌ మాత్రం మరమ్మతులకు అధిక సమయం తీసుకోవడంతోపాటు ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం ఇంజినీరింగ్‌ అధికారుల అంచనాల ప్రకారం రూ.100 కోట్లలోపే నష్టం జరిగి ఉంటుందని సమాచారం. ఇంజినీర్లు సైతం కేవలం రెండున్నర నెలల్లోనే ఈ ప్లాంట్‌ పునరుద్ధరణ చేపట్టడం విశేషం. గత ఆగస్టు 21న విద్యుత్‌ ప్రమాదం జరిగితే ప్లాంట్‌లో పేరుకుపోయిన పొగ ను తొలగించడం, రిపేర్లకు అనువుగా చేసే పనులకే దాదాపుగా రెండు వారాల సమయం పట్టింది. ఆ తర్వాత పలువురు ఇంజినీర్లు, అధికారులు కరోనా కు గురయ్యారు. ఇలా అవాంతరాలు ఎదురైనా ప్ర భుత్వం పర్యవేక్షణతో ఇంజినీర్లు ప్లాంట్‌ పునరుద్ధరణలో నిమగ్నమయ్యారు. ప్లాంట్‌ను కాపాడుకోవడంలో మృత్యువాతపడిన అధికారుల స్ఫూర్తితో ఎ డమగట్టు జల విద్యుత్‌ కేంద్రాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాంట్‌ రెండు యూనిట్లలో నిరంతర విద్యుదుత్పత్తి జరుగుతుండటంపై ప్రజ ల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రమాదం జరిగినప్పటి నుంచి కూ డా పెద్ద ఎత్తున వరద రావడంతో జలాశయం నిండుకుండలా ఉన్నది. దీనివల్ల గతంలోని విద్యు త్‌ లోటును తిరిగి భర్తీ చేసుకునే అవకాశం ఉన్నది. మల్లన్న సన్నిధిలో మంత్రి

శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు దర్శించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న వారికి ఈవో రామారావు స్వాగతం పలకగా, అర్చకులు తిలకధారణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు వల్లించారు. ఆలయ ఏఈవో మల్లయ్య స్వామివార్ల శేషవస్ర్తాలు, లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూదితోపాటు జ్ఞాపికను అందజేశారు. మంత్రి వెంట ఎనర్జీ సెక్రటరీ సందీప్‌ సమారియా, విద్యుత్‌ సౌధ సీఈ సురేశ్‌, డీఈ వెంకటేశ్వరరెడ్డి, సివిల్‌ ఎస్‌ఈ రవీంద్ర, పవర్‌ప్లాంట్‌ సీఈ మేక ప్రభాకర్‌రావు, ఎస్‌ఈ సద్గుణకుమార్‌, ఎస్పీ సాయిశేఖర్‌, డీఎస్పీ, సీఐ, ఎస్సై తదితరులు ఉన్నారు.