మంగళవారం 01 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 27, 2020 , 04:16:49

ముగిసిన శరన్నవరా్రత్రి ఉత్సవాలు

ముగిసిన శరన్నవరా్రత్రి ఉత్సవాలు

  కల్వకుర్తి :  కల్వకుర్తి పట్టణంలోని  శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు వాసవీమాత వివిధ శక్తి రూపాల్లో  భక్తులకు దర్శనమిచ్చారు.ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వాసవీమాతను పూలతో అలంకరించారు. సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో జమ్మిచెట్టుకు పూజలు చేశారు.

కార్యక్రమంలో అమ్మవారి లడ్డూను, అమ్మవారికి అలంకరించిన చీరెలను వేలం వేశారు లడ్డూను రూ.32,116కు కలిమిచర్ల రమేశ్‌ దక్కించుకున్నారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన చీరెలను  రూ.19,116లకు వాస శేఖర్‌,  రూ.21,116లకు ఇరివెంటి రమేశ్‌, రూ.25,116 పోల విజయ్‌కుమార్‌,  రూ.26,116 జూలూరి సత్యం, రూ.35,116లకు గోవిందు కృష్ణయ్య, రూ. 40, 116కు అప్పాయిపల్లి శ్రీను, రూ, 33,116లకు పానుగంటి వెంకటేశ్‌ లు వేలంపాడి దక్కించుకున్నారు.  అమ్మవారి ఒడి బియ్యం చీరను రూ.17,116లకు దాచేపల్లి తిరుపతయ్య దక్కించుకున్నారు. అదే విధంగా సరస్వతీమాత దేవాలయంలో అమ్మవారి చీరెలను రూ.19.116లకు జూలూరి నరసింహ్మ,  రూ.16.116లకు ఆకుతోట శేఖర్‌, రూ.20.116లకు ఆకుతోట రవికుమార్‌,  రూ.15,116లకు జగదీశ్వర్‌,  రూ.16,116లకు శ్రీను, రూ.16,116లకు గోవిందు భారతయ్య,రూ. 20,116లకు ప్రకాశ్‌, రూ. 22,116లకు ఆకుతోట వెంకటేశ్‌, పుష్పాలంకరణ చీరెను రూ. 20,116లకు కూన విజయ్‌కుమార్‌ దక్కించుకున్నారు. వాసవీమాత లడ్డూ, చీరెల వేలంతో మొత్తం రూ.2, 49,044లక్షలు రాగా, సరస్వతీమాత  చీరెల వేలంతో రూ. 1,65, 044లక్షలు వచ్చాయని ఆలయ ట్రస్టీ చైర్మన్‌ జూలూరి రమేశ్‌బాబు చెప్పారు. అనంతరం అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్య వైశ్య సంఘ సభ్యులు, వాసవీక్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.