శనివారం 28 నవంబర్ 2020
Nagarkurnool - Oct 24, 2020 , 00:33:47

అమ్మవారికి ప్రత్యేక పూజలు

అమ్మవారికి ప్రత్యేక పూజలు

  •   ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కశిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేశారు.  ఈసందర్భంగా ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ వాసవీమాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అంతకుముందు దేవస్థాన ట్రస్టీ చైర్మన్‌ జూలూరి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కందుకూర్‌ జనార్దన్‌ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వెంకటేశ్వర్లు అమ్మవారికి రూ.60 వేలు విలువ చేసే వెండి కిరీటాన్ని అర్చకులకు బహూకరించారు. అదేవిధంగా పార్థసారధి థియేటర్‌ పక్కన ప్రతిష్ఠించిన దుర్గామాతకు భక్తులు పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, వాసవీక్లబ్‌ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జూపల్లిలో పూజలు చేసిన ఎమ్మెల్యే 

చారకొండ: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జూపల్లిలో భగత్‌సింగ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బక్కమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటయ్యయాదవ్‌, బాలేమియా, భగత్‌సింగ్‌ యువజన సంఘం నాయకులు, గ్రామస్తులున్నారు. 

అన్నపూర్ణాదేవి రూపంలో.. 

ఊర్కొండ: మండల కేంద్రంలోని అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఊర్కొండపేట, బొమ్మరాసిపల్లి, మాధారం, రేవల్లి, రాచాలపల్లి, తిమ్మన్నపల్లి గ్రామాల్లో దుర్గాదేవిని భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. బొమ్మరాసిపల్లిలో భవానీ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్ద బోనాలు సమర్పించి కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాండు ఆచారి, వివేక్‌గౌడ్‌, శేఖర్‌, సాయిచారి పాల్గొన్నారు. మాధారంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద పాపిశెట్టి చంద్రమోహన్‌ ఆన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అరుణ్‌కుమార్‌రెడ్డి, నేతాజీ యువజన సంఘం సభ్యులు దివాకర్‌ గౌడ్‌, నిఖిలేష్‌రెడ్డి, మహేశ్‌, రాజేందర్‌గౌడ్‌, యశ్వంత్‌, వినయ్‌, అనిల్‌, సుమంత్‌, జగన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

మహాలక్ష్మి అవతారంలో.. 

కల్వకుర్తి రూరల్‌: మండలంలోని వివిధ గ్రా మాలతోపాటు కల్వకుర్తి పట్టణంలోని పెద్దమ్మతల్లి యూత్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి మండపం వద్ద మహిళలు కోలాటం, దాం డియా ఆడుతూ సందడిగా గడిపారు.

గౌరీపూజ, కుంకుమార్చన..           

వెల్దండ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భా గంగా వెల్దండ మండలం చెర్కూర్‌ గ్రామంలో అమ్మవారికి ఉప సర్పంచ్‌ నర్సింహ దంపతు లు గౌరీపూజ, కుంకుమార్చన నిర్వహించా రు. అమ్మవారు శుక్రవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెల్దండలోని బుదార్‌పేట ఆంజనేయస్వామి ఆలయంలో అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం, వా సవీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కుప్పగండ్ల, పెద్దాపూర్‌, వెల్దండ, కొట్ర గ్రా మాల్లో అమ్మవారు నిత్యపూజలు అందుకుంటున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సంతోష, లాలయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.