నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి

కోడేరు: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని జనుంపల్లి, తీగలపల్లికి చెందిన శేషయ్య మంజూరైన రూ.లక్ష ఎల్వోసీని శుక్రవారం హైదరాబాద్‌లోని నివాసంలో బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కార్పొరేట్ వైద్య సౌకర్యం కలుగుతుందన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న శేషయ్యకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్వోసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి కొల్లాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద కురుమయ్య, జనుంపల్లి, తీగలపల్లి సర్పంచులు కవిత, శివారెడ్డి టీఆర్ఎస్ నాయకులు కురుమయ్య, శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.
పీఆర్ఎల్ఐ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే భేటీ
కొల్లాపూర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి రిజర్వాయర్ అంజనగిరిలో ముంపునకు గురయ్యే వడ్డెగుడిసెలు, అంజనగిరి, సున్నపుతండాల్లో 110ఇండ్లు మంజూరుకాగా వాటికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నుంచి బాధితులకు అందాల్సిన పరిహారం కోసం సాగునీటి పారుదల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో సాగునీటి పారుదల ప్రధాన కార్యాలయంలో ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజినీర్ రమేశ్‌తో ఎమ్మెల్యే బీరం సమావేశమై చర్చించారు. జీవో 123 ప్రకారం గతంలో మంజూరైన 199 ఇండ్ల నిర్మాణాలకుగానూ ఒక్కొక్క ఇంటికి రూ.5లక్షలు పరిహారం ఇచ్చారు. అయితే ఇండ్లకు మాత్రమే పరిహారం ఇచ్చారు.
తమకు ఇండ్ల ముందు ఉన్న స్థలాలకు పరిహారం కావాలని బాధితులు ఎమ్మెల్యే బీరంను ఆశ్రయించారు. ఆయా గ్రామాల నిర్వాసితులతో కలిసి ఎమ్మెల్యే బీరం ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించడంతో సదరు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు బోడబండతండా ఎంపీటీసీ శంకర్‌నాయక్ తెలిపారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన వారిలో వార్డుసభ్యులు శంకర్‌నాయక్, సీతారాంనాయక్, నిరంజన్‌నాయక్, సీతారాంనాయక్, భీముడు, శేషయ్య, వెంకటస్వామి, శ్రీను తదితరులున్నారు.
తాజావార్తలు
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
- ఆరోగ్యానికి లైవ్ చేపలే మేలు
- వ్యాక్సిన్‌పై భయం వద్దు
- నంబర్ప్లేట్లు లేని వాహనాలకు జరిమానా
- విడుతల వారీగా అందరికీ వ్యాక్సిన్
- ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
- రాజన్న కోడెలకు గాలికుంటు నివారణ టీకాలు