బుధవారం 20 జనవరి 2021
Nagarkurnool - Oct 24, 2020 , 00:19:52

సోమశిల మంచినీటి పథకంలో మోటర్లు పరిశీలన

సోమశిల మంచినీటి పథకంలో మోటర్లు పరిశీలన

కొల్లాపూర్‌: మిషన్‌ భగీరథ పథకం నుంచి పట్టణానికి తాగునీటి సరఫరా నిలిచిపోనుండడంతో కొల్లాపూర్‌ మున్సిపల్‌ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. పట్టణానికి కృష్ణానది నుంచి రక్షిత మంచినీటి సరఫరా చేసే సోమశిల తాగునీటి పథకంలోని మోటర్లను శుక్రవారం కమిషనర్‌ వెంకటయ్య, ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించారు. మిషన్‌ భగీరథ పథకం అమలు కాకముందు కొల్లాపూర్‌ పట్టణానికి సోమశిల నది నుంచి తాగునీరు సరఫరా అయ్యేది.

కొత్తగా భగీరథ   తాగునీరు పట్టణానికి సరఫరా కావడంతో సోమశిల రక్షత మంచినీటి పథకం నీటిని వినియోగించలేదు. ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌ మోటర్లు ముంపునకు గురికావడంతో భగీరథకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో పట్టణ మాజీ ఉపసర్పంచ్‌ చంద్రశేఖరాచారి, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.logo