బుధవారం 25 నవంబర్ 2020
Nagarkurnool - Oct 23, 2020 , 02:16:39

నిజాయితీగా, నిర్భయంగా.. విధులు నిర్వర్తిస్తామని..

నిజాయితీగా, నిర్భయంగా.. విధులు నిర్వర్తిస్తామని..

  • బాధల నుంచి బాధ్యత వైపు 
  • నల్లమల నుంచి 10 మంది..
  • శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలు
  • నేడు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పది మంది యువకులు ఎస్సై శిక్షణ పూర్తి చేసుకొని శుక్రవారం నుంచి విధుల్లో చేరనున్నారు. 2019 అక్టోబర్‌ 23వ తేదీన ప్రారంభమైన శిక్షణ ఈనెల 23తో ముగియనున్నది. హైదరాబాద్‌లో ఏడాది కాలం పాటు కఠోరమైన ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్నారు. టీఎస్‌పీఏలో ఏడాది పాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ఫైరింగ్‌, న్యాయశాస్త్రం, శాంతిభద్రతలు, కంప్యూటర్‌, ట్రాఫి క్‌, కోర్టు, జైలు విధులు తదితర అంశాల్లో తర్ఫీదు పొంది రెండు కఠినమైన సెమిస్టర్‌లలో ఉత్తీర్ణులయ్యారు. శిక్షణ కా లంలో మేడారం జాతర, వినాయక చవితి, మున్సిపల్‌ ఎన్నికల్లో సేవలు అందించారు.

శుక్రవారం అవుట్‌ పరేడ్‌ వేడుక లు పూర్తి చేసుకొని సాయంత్రానికి కేటాయించిన జిల్లాలకు చేరుకొని రిపోర్టు చేయనున్నట్లు శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సై లు తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 23 మంది శి క్షణ పొందిన వారిలో ఉండగా.., అచ్చంపేట నియోజకవర్గం నుంచే 10 మంది ఉన్నారు. బల్మూర్‌ మండలం గోదల్‌ గ్రామానికి చెందిన అరుణోదయ, పదర మండలం జ్యోతినాయక్‌తండాకు చెందిన గోపాల్‌, పదర మండలకేంద్రానికి చెందిన మండ్లి కల్యాణ్‌యాదవ్‌, శివాజీ, అ చ్చంపేటకు చెందిన కల్యాణ్‌రావు, ఉప్పునుంతలకు చెందిన రాధిక, లింగాల మండలం అంబట్‌పల్లికి చెందిన శ్రీనివాసులు, లింగాలకు చెందిన అంజి, లింగాల మండలం మగ్దుంపూర్‌కు చెందిన శివసాగర్‌, అచ్చంపేట మండలం బక్కాలింగాయపల్లికి చెందిన నర్సింహ విధుల్లో చేరనున్నారు.