శుక్రవారం 04 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 22, 2020 , 03:22:46

నీళ్లు తోడితేనే కేఎల్‌ఐపై స్పష్టత

నీళ్లు తోడితేనే కేఎల్‌ఐపై స్పష్టత

  • జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ఎల్లూరు లిఫ్ట్‌ వద్ద పంప్‌హౌస్‌లో నీటిని పూర్తిగా తోడితేనే కేఎల్‌పై స్పష్టత వస్తుందని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి అన్నారు. బుధవారం సాయంత్రం కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వద్ద పంపుహౌస్‌ను ఆయన పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పంపుహౌస్‌లో ప్రస్తుతం నీరు చేరడం వల్ల ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు. నీటిని తోడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గారి ఇచ్చిన హామీ మేరకు సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్జి మంజూరు చేశారన్నారు. ఆయన వెంట నాయకులు దిలీపాచారి, సుధాకర్‌రెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు.