శనివారం 05 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 22, 2020 , 03:22:49

నవంబర్‌ 1న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష

నవంబర్‌ 1న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష

బిజినేపల్లి: ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ గురుకులాల్లో నవంబర్‌ 1న ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి నాగార్జున్‌రావు, అసిస్టెంట్‌ గిరిజన గురుకుల అధికారి శ్రీనివాసులు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. సకాలంలో పరీక్షకు హాజరు కావాలని వారు సూచించారు.