సోమవారం 25 జనవరి 2021
Nagarkurnool - Oct 22, 2020 , 03:22:49

ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పోలీసు శిక్షణ

ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పోలీసు శిక్షణ

కందనూలు: ఇంటర్‌ పూర్తి చేసిన వారు, ఫస్టియర్‌ పూర్తి చేసి సెకండియర్‌లోకి వెళ్లిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ విద్యా కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలో 18-33 ఏండ్ల లోపు వయస్సు ఉండి ఇంటర్‌ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునే పురుషుల ఎత్తు 167.6సెం.మీ, ఛాతి 86.3సెం.మీ ఊపిరి పిల్చినప్పుడు +5సెం.మీ ఉండాలన్నారు. స్త్రీల ఎత్తు 156సెం.మీ, ఛాతి 80సెం.మీ ఊపిరి పీల్చినప్పుడు +5సెం.మీ ఉండాలన్నారు. దరఖాస్తులో స్థానికుల అభ్యర్థులకు 80శాతం ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మరితం సమాచారానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలని తెలిపారు.logo