గురువారం 26 నవంబర్ 2020
Nagarkurnool - Oct 22, 2020 , 03:22:49

పోలీస్‌ అమరవీరులకు ఘన నివాళి

పోలీస్‌ అమరవీరులకు ఘన నివాళి

  • నివాళులర్పించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, అదనపు కలెక్టర్‌ హన్మంత్‌రెడ్డి, ఎస్పీ సాయిశేఖర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం పోలీస్‌ అమరవీరుల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన అమరుల స్థూపానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి, అదనపు కలెక్టర్‌ హన్మంత్‌రెడ్డి, ఎస్పీ సాయిశేఖర్‌లు పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ వారి ప్రాణ త్యాగం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. అమరులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యుల సమస్యలను తెలుసుకొని వారికి పోలీస్‌శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకు ముందు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ అనోక్‌జయకుమార్‌, ఎ.ఆర్‌ డీఎస్‌పీ దీపక్‌చంద్ర, మోహన్‌రెడ్డి, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, సీఐ, ఎస్‌ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.