గురువారం 03 డిసెంబర్ 2020
Nagarkurnool - Oct 22, 2020 , 03:22:49

లలితాదేవి అలంకరణలో వాసవీమాత

లలితాదేవి అలంకరణలో వాసవీమాత

కల్వకుర్తి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీమాత బుధవారం లలితాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఉదయాన్నే సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఉత్సవాలకు సహకరించిన దాతలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ట్రస్టీ చైర్మన్‌ రమేశ్‌బాబు సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వాసవీక్లబ్‌ క్లబ్‌ సభ్యులు, ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.

సర్వసతీదేవి అలంకరణలో.. 

వెల్దండ: మండల కేంద్రంలోని బుధార్‌పేట ఆంజనేయస్వామి ఆలయంలో  కొలువైన దుర్గామాత బుధవారం సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వెల్దండలో అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం, వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం చేశారు. మండలంలోని కుప్పగండ్ల, పెద్దాపూర్‌, చెర్కూర్‌, వెల్దండ గ్రామాల్లో అమ్మవారు నిత్యపూజలు అందుకుంటున్నారు. కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం జిల్లా కోశాధికారి బచ్చురామకృష్ణ, నాయకులు వజ్రలింగం, పూరి రమేశ్‌, రాజయ్య, రాజు, సంతోష్‌, నరేశ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో..

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తి మండలంలోని మార్చాల, వరాల మైసమ్మ, గుండూర్‌, తర్నికల్‌, ఎల్లికట్ట గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈసందర్భంగా అమ్మవారు బుధవారం సరస్వతీ మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పెద్దమ్మ తల్లి యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి మహిళలు ఒడిబియ్యం సమర్పించి పూజలు చేశారు.