బతుకునిస్తున్న రైతుబండి

- కుటుంబాలను పోషిస్తున్న ట్రాక్టర్లు
- జిల్లాలో 380 మందికి సబ్సిడీపై పంపిణీ
- ప్రతి గ్రామంలోనూ పదేసి ట్రాక్టర్లు
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ : కాలం మారింది.. సేద్యం మారింది.. రైతన్నలకు పూర్వం నుంచి ఎద్దుల బండినే రవాణా వాహనంగా వాడుతున్నారు.. అయితే, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సాగునీటి వనరులు పెరిగాయి. దీంతో సాగుపై రైతుల ఆసక్తి పెరిగింది.. ఫలితంగా పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం ఎద్దుల బండి స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. దీంతో జిల్లాలో గ్రామగ్రామానా ట్రాక్టర్లు రాజ్యమేలుతున్నాయి..
గ్రామాల్లో ట్రాక్టర్లు రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో వేగం పెంచేందుకు ట్రాక్టర్లను ప్రధాన రవాణా వాహనాలుగా వాడుతున్నారు. ప్రభుత్వం రైతులకు రాయితీలపై అందజేసిన ట్రాక్టర్లు.. రైతులు, ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలను పూర్తిగా మార్చేశాయి.
జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రెండు విడతల్లో దాదాపుగా 380 ట్రాక్టర్లను అందజేశారు. వీటితో వ్యవసాయ సీజన్లు ప్రారంభమయ్యే ముందు ఎరువులను వేయడం నుంచి పంటలు చేతికి వచ్చి అమ్ముకునే వరకు ఎనలేని సేవలు అందిస్తున్నా యి. వ్యవసాయ పనులు లేని సమయంలో ఇతర పనులు చేసుకుం టూ ఉపాధి పొందుతున్నారు. ఇలా రైతుల బండిగా మారిన ట్రాక్టర్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో జిల్లా ఏర్పడక ముందు ఒక్క ట్రాక్టర్ షోరూం కూడా లేకపోగా.., ఇప్పుడు జిల్లా కేంద్రంలో 9 షో రూంలు వెలిశాయి. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌లోనూ కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఏ గ్రామంలో చూసినా దాదాపు పది వరకు ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇలా జిల్లాలో రవాణా శాఖ రికార్డుల మేరకు వ్యవసాయ పనుల్లో దాదాపుగా 2,928 ట్రాక్టర్లు ఉన్నాయి. వ్యవసాయేతర పనుల్లో 2,348 ట్రాక్టర్లు ఉన్నట్లుగా అంచనా.
రూ.50వేల వరకు ఆదా..
నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరుకు చెందిన వెంకటయ్యకు ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తి, మొక్కజొన్న, వరి వంటివి సాగు చేసుకుంటున్నాడు. అయితే, వ్యవసాయ పనులకు అతడి తల్లిదండ్రులు అప్పటివరకూ ఎద్దుల బండ్లను వాడేవారు. పనుల్లో వేగం కోసం అద్దెకు ట్రాక్టర్ తెచ్చుకొనేవారు. ఇలా ఒక్కో సీజన్‌కు రూ.25 వేల వరకు ఖర్చు అయ్యేది. ఏడాదిలో రెండుపంటలకు కలిపి రూ.50వేల వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఈ క్రమంలో 2017-2018 సంవత్సరంలో వెంకటయ్యకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్ అందజేసింది. అతడు రూ.3.50 లక్షలు చెల్లించగా..
మిగిలిన సగం డబ్బులను ప్రభుత్వమే ఇచ్చింది. ఇలా ట్రాక్టర్ తెచ్చుకున్న వెంకటయ్య జీవితం మారిపోయింది. పొలం దున్నడం, ఎరువులు వేయడం, దుక్కులు చేయడం, భూమి చదును చేయడం, పండిన పంటను అమ్ముకునేందుకు ఈ ట్రాక్టర్‌ను వినియోగించుకుంటున్నాడు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో వేగాన్ని అందుకోవడానికి ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ట్రాక్టర్ కిరాయికి తెచ్చుకుంటే ఏడాదికి రూ.50 వేలు ఖర్చేయ్యేది. ఇప్పుడు ఆ డబ్బులు ఆదా అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను.
తాజావార్తలు
- కూరగాయల సాగు లాభాలు బాగు
- లక్షణంగా వదిలేశారు!
- నిక్కర్వాలాలు తమిళ భవితవ్యం నిర్దేశకులు కారు: రాహుల్
- డ్రైవర్లు ఏకాగ్రతతో వాహనాలు నడుపాలి
- ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే
- చేపల పెంపకంలో నయా టెక్నాలజీ!
- వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలి
- గుండెపోటుతో టీఆర్ఎస్ నాయకుడి మృతి
- ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం
- సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం