గురువారం 29 అక్టోబర్ 2020
Nagarkurnool - Oct 02, 2020 , 03:37:30

డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

  • ఎంపీడీవో శంకర్‌నాయక్‌

అమ్రాబాద్‌: కార్యదర్శులు గ్రామాల్లో ఇండ్లు, తదితర ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు వదంతులు వస్తున్నాయని.. అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో శంకర్‌నాయక్‌ హెచ్చరించారు. ఈ మేరకు అన్ని గ్రామాల కార్యదర్శులు, సర్పంచులకు సమాచారాన్ని చేరవేయాలని ఎంపీవో వెంకటయ్యకు గురువారం సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజలు అధికారులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దన్నారు. సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే.. ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని తెలిపారు. 


logo