గురువారం 29 అక్టోబర్ 2020
Nagarkurnool - Oct 02, 2020 , 03:18:45

దేశానికి మార్గదర్శకం... కొత్త రెవెన్యూ చట్టం

దేశానికి మార్గదర్శకం... కొత్త రెవెన్యూ చట్టం

  • ప్రజలకు మేలు చేసే చట్టాలకే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం
  • రైతన్నల వెన్ను విరిచేలా కేంద్ర వ్యవసాయ బిల్లు
  • తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమలు పై రైతుల సంబరాలు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కల్వకుర్తి 
  • నియోజకవర్గం ఆమనగల్లులో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

నూతన రెవెన్యూ చట్టం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ శాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ అభివర్ణించారు. తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రైతులు సంబురాలు చేసుకుంటుంటే .. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు మాత్రం అన్నదాతల నడ్డి విరిచేలా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రైతులు 1500ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులతోపాటు ఎంపీ రాములు, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, నాగర్‌కర్నూల్‌,రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు పద్మావతి,అనితారెడ్డి పాల్గొన్నారు. 

- కల్వకుర్తి 

 తెలంగాణ లో అమల్లోకి వచ్చిన నూతన రెవె న్యూ చట్టం దేశానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభివర్ణించారు. రైతులకు గుదిబండలా మారి పీడించి పిప్పి చేసే కాలం చెల్లిన రెవెన్యూ చట్టాలకు సీఎం కేసీఆర్‌ మంగళం పాడారని పేర్కొన్నారు. దూరదృష్టితో తీసుకొచ్చిన నూత న చట్టం దేశానికి దిక్సూచిగా మారడంలో అతిశయోక్తిలేదన్నారు. గురువారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మండల కేంద్రంలో నూతన చట్టానికి మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆధ్వర్యంలో రైతులు ట్రా క్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ పోతుగంటి రాములు, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్లు పద్మావతి, అనితారెడ్డి, రైతుబంధు స మితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే జై పాల్‌యాదవ్‌తో పాటు రైతులు క్షీరాభిషేకం చేశా రు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి దాదాపుగా 1500 ట్రాక్టర్లతో ఆమనగల్లు మండల కేంద్రానికి తరలివచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించారు. రైతులు ఒగ్గుడోళ్లు, సంప్రదాయ నృత్యాలు చేసి, పటాకులు కాలుస్తూ ‘నూతన రెవెన్యూ చట్టం.. ఆమోదయోగ్యం’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణలో రైతులు భూమి కోసం ఆగచాట్లు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పకడ్బందీగా చట్టాలు తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో తెలంగాణను ఉ జ్వల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ల క్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సా గుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 వేల చెరువులను మిషన్‌ కాకతీయ ద్వారా పూడికతీత పనులు చేశామన్నా రు. సమైక్య ఆంధ్ర పాలనలో ఉబిలోకి కూరుకుపోయిన రైతులు.. ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఆర్థిక పరిపుష్టి సాధించారని చెప్పారు. ప్రజల కోసం అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెల్లిందని పేర్కొన్నా రు. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే రాష్ట్రంలో వ్యవసాయాన్ని పరుగులు పెడుతున్నదన్నారు. 9 నెలల పాటు మేధావులు, వ్యవసాయరంగ నిపుణులతో కలిసి సుదీర్ఘ ఆలోచనలు, సమీక్షల అనంతరం నూతన రెవెన్యూ చట్టాలకు రూపకల్పన చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతుంటే.. రాష్ట్రంలో రైతులు సంబురాల్లో మునిగిపోయారని సంతోషం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమం కోరే నాయకుడు మాకు అండగా ఉండి నూతన చట్టం తీసుకొచ్చార ని సీఎం కేసీఆర్‌కు క్షీరాభిషేకాలు చేస్తూ తెలంగాణ మొ త్తం సంబురాలో మునిగిపోయిందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నూతన చట్టం త్వరలో అమలు కాబోతుందన్నారు. రైతులకు మంచి రోజులు రానున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు చూసి తెలంగాణలో ఏ పార్టీ బతికిబట్ట కట్టే పరిస్థితిలేదన్నారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రులు భరోసా కల్పించారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


logo