బుధవారం 28 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 29, 2020 , 06:57:50

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌కు ‘విశ్వగురువు వరల్డ్‌ రికార్డు’ అవార్డు

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌కు ‘విశ్వగురువు వరల్డ్‌ రికార్డు’ అవార్డు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌కు కరోనా వారియర్‌ అవార్డు దక్కింది. ఈ మేరకు విశ్వగురు వరల్డ్‌ రికార్డు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సత్యవోలు రాంబాబు సోమవారం కలెక్టరేట్‌లో అవార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని కలెక్టర్‌ శర్మన్‌కు అందజేశారు. జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఆపద సంభవిస్తే గంటలోపే అక్కడకు చేరుకుని ఇబ్బందులను తొలగిస్తూ.. పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫ లాలు అందేలా అనునిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నందున కలెక్టర్‌ శర్మన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశామని సంస్థ బాధ్యులు ప్రకటించారు.

జిల్లా యంత్రాంగం కృషి వల్లే గుర్తింపు : కలెక్టర్‌

ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటి సారిగా తనకు అవార్డు అందజేయడం సంతోషంగా ఉందని, జిల్లా యంత్రాంగం కృషి వల్లే గుర్తింపు లభించిందని కలెక్టర్‌ శర్మన్‌ అన్నారు. జిల్లాలో తాను చేస్తున్న పనులను గుర్తించి అవార్డు అందజేయడం మరింత బాధ్యతను పెంచినట్లయ్యిందని తెలిపారు. అనంతరం మహబూబ్‌నగర్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు అంబటి నటరాజు కలెక్టర్‌ శర్మన్‌ను శాలువాతో సత్కరించి పీపీ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హన్మంత్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, విశ్వగురువు నాగర్‌కర్నూల్‌ కోఆర్డినేటర్‌ తెప్ప శ్రీనివాసులు, రెడ్‌క్రాస్‌ సంస్థ కుమార్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


logo