సోమవారం 26 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 27, 2020 , 07:12:12

నేడు కవి సమ్మేళనం

నేడు కవి సమ్మేళనం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : మహాత్మాగాంధీ 150వ జయంతి ముగింపు వారోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా గాంధీ కింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాప క అధ్యక్షుడు సర్వోదయ ప్రసాద్‌, నిర్వాహకుడు మురళీధర్‌రావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విడుతల వారీగా అంతర్జాల మాధ్యమంగా భారీ అంతర్జాల కవి సమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఐఏఎస్‌ సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ నరసింహారెడ్డి హాజరవుతారన్నారు. ఏడు విభాగాలుగా సుమారు 180 మంది కవుల కవిత, పద్యం, గేయం, వివిధ ప్రక్రియల్లో గాంధీ గురించి కవి సమ్మేళనం జరుగుతుందన్నారు. 


logo