శనివారం 31 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 25, 2020 , 05:37:19

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత

కల్వకుర్తి రూరల్‌: ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన బాలాగౌడ్‌ వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం రూ.31 వేలు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన చెక్కును బాలాగౌడ్‌కు ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో కుర్మిద్ద ఎంపీటీసీ శంకర్‌నాయక్‌, వెంకటాపూర్‌ తండా సర్పంచ్‌ రమేశ్‌నాయక్‌, యాదయ్యగౌడ్‌, నరేందర్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మర్రి

తాడూరు: మండలంలోని ఇంద్రకల్‌ గ్రామానికి చెందిన వారికి సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గురువారం అందజేశారు. ఇంద్రకల్‌ గ్రామానికి చెందిన రామేశ్వరమ్మకు రూ.46వేలు, నగేశ్‌కు రూ.8వేలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమణతోపాటు తదితరులు ఉన్నారు.