గురువారం 22 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 25, 2020 , 05:37:19

శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం

శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం

  • పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా వెలుగులోకి..
  • శోధించేందుకు  పురావస్తు శాఖ సన్నాహాలు
  • నలుదిక్కులు ద్వారాలున్నట్లు ఈవో వెల్లడి
  • శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం

శ్రీశైలం: శ్రీశైల ఆలయానికి పరివార దేవాలయాలైన పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా ఘంటామఠం ఆవరణలో ప్రాచీనకాలం నాటి ధ్యాన మందిరం బయటపడింది. గురువారం సాయంత్రం ఘంటామఠం ముందు భాగంలోని కోనేరుకు ఉత్తర భాగాన సుమారు  6 అడుగుల 6 అంగుళాల విస్తీర్ణంతో ధ్యానమందిరం కనిపించినట్టు ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. ఈ ధ్యాన మందిరంలో నైరుతి నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుంచి తూర్పు మార్గం వైపుకు సొరంగాలు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ప్రాచీన కాలం నాటి  నిర్మాణాలకు విఘాతం కలగకుండా నిర్మాణం చేపడుతున్నారు. రోజురోజుకూ బయట పడుతున్న పురాతన కట్టడాలపై పురావస్తుశాఖ అధికారులు కూడా శోధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ధ్యాన మందిరాన్ని పరిశీలించిన వారిలో ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ శ్రీహరి, సహాయ స్థపతి జవహర్‌, ఏఈ సురేశ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు.


logo