బుధవారం 28 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 24, 2020 , 05:41:38

పట్టణాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

పట్టణాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి

కల్వకుర్తి రూరల్‌ : మున్సిపల్‌ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్‌ సత్యం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. అనంతరం పట్టణానికి చెందిన సంధ్యారాణికి మంజూరైన సీఎం సహాయం నిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ షాహేద్‌, కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo