శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 23, 2020 , 04:15:01

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఫస్ట్‌

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఫస్ట్‌

కల్వకుర్తి : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని శాసనమండలి సభ్యుడు కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండలం కిష్టరాంపల్లికి చెందిన గ్రామస్తులు మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారందరి మెడలో గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్సీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు .రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.అన్ని రంగాల్లో రాష్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అండగా నిలబడ్డారని చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ చెప్పారు.ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతలతో కల్వకుర్తి నియోజకవర్గంలో సాగునీరు అందుతుందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో మిగతా మండలాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తెలిపారు. కార్యకర్తలందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వం చేపడుతున్న అభివృధ్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌, మల్లేశ్‌, రామస్వామి,శివ, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు  పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు అనునిత్యం అండగా నిలుస్తున్నదని శాసనమండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాకు చెందిన మల్లేశ్‌ అనారోగ్యానికి గురై వైద్య సాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో  మల్లేశ్‌ వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి రూ.7.500 మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును బాధితుడికి ఎమ్మెల్సీ కశిరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామానికి చెందిన భాగ్యమ్మ, తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన అండాలుకు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను బాధితుల బంధువులకు మంగళవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అందజేశారు. భాగ్యమ్మకు రూ.40వేలు, ఆండాలుకు రూ.60వేలు మంజూరయ్యాయి. కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి , శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి, పవన్‌రెడ్డి  పాల్గొన్నారు.logo