సోమవారం 26 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 21, 2020 , 06:37:19

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి: పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలి సభ్యుడు కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం చుక్కాపూర్‌ గ్రామ పంచాయితీకి చెందిన యాదగిరి అనారోగ్యానికి గురై వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కసిరెడ్డి సహకారంతో యాదగిరి వైద్యం కోసం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.60వేలు మంజూరయ్యాయి. ఆదివారం హైద్రాబాద్‌లో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును బాధితుడికి ఎమ్మెల్సీ ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సుమన్‌, మల్లేశ్‌, అశోక్‌, హన్మంత్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆర్గానిక్‌ ఫుడ్స్‌మాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బంధువుకు చెందిన లక్ష్య ఆర్గానిక్‌ ఫుడ్స్‌ను హైదరాబాద్‌లో  ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.logo