శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 20, 2020 , 05:23:17

8.3 మి.మీ. వర్షపాతం నమోదు

8.3 మి.మీ. వర్షపాతం నమోదు

కల్వకుర్తి రూరల్‌ : మండలంలో శనివారం 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్‌ రాంరెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఉదయం దాదాపు గంటన్నరకు పైగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుంటలు, చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. 

భారీగా కురిసిన వర్షం

చారకొండ : మండలంలోని చారకొండ, మర్రిపల్లి, జూపల్లి, సిరుసనగండ్ల, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. పంటలు కళకళలాడు తుండడంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నాడు.