మంగళవారం 27 అక్టోబర్ 2020
Nagarkurnool - Sep 19, 2020 , 02:32:44

కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత

కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత

 దేవరకద్ర రూరల్‌: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చే శారు. ఇంత వరద 2009లో వచ్చి ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తారు. 11 ఏండ్ల తర్వాత శు క్రవారం ప్రాజెక్టులోని 12 గేట్లు ఎత్తారు. దీంతో దిగువకు 8వేల క్యూసెక్కులు విడుదలైంది. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వరద తగ్గడంతో క్రమంగా గేట్లను మూసివేసి 4గేట్ల ద్వారా 2000 క్యూసెక్కులు వదులుతున్నట్లు ప్రాజెక్టు డీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు. సా యంత్రం వరద పె రగటంతో 5గేట్ల ద్వారా 2500 క్యూ సెక్కులు విడుదల చేయగా, ఇన్‌ఫ్లో 2వేలకు పైగా వస్తుందన్నారు. ప్రాజెక్టు లో 32.6 అడుగు ల నీటి నిల్వ ఉన్న ట్లు తెలిపారు.

తాజావార్తలు


logo