శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 17, 2020 , 07:52:55

అక్టోబర్‌ 15లోగా రైతు వేదికలు పూర్తవ్వాలి

అక్టోబర్‌ 15లోగా రైతు వేదికలు పూర్తవ్వాలి

  •  అధికారులు అలసత్వం వహిస్తే కలెక్టర్లదే బాధ్యత
  • పీఆర్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌  సత్యనారాయణరెడ్డి
  •  నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : రైతువేదిక భవనాలు అక్టోబర్‌ 15వ తేదీ నాటికి పూర్తిచేసి తాళాలు అందజేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ సత్యనారాయణరెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పంచాయతీరాజ్‌ డిప్యూటీ సెక్రెటరీ రవీందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మనూచౌదరితో కలి సి పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖ డీఈలు, ఏఈలతో నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు.

కలెక్టర్‌ శర్మన్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 15వ తేదీ నాటికి 143 రైతు వేదికలు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నిర్మాణ దశలో కొనసాగుతున్న పనులకు ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయకపోవడంపై కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం చేస్తే స రెండర్‌ చేస్తానని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ బిల్లులు నమోదు చేసేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నారు. శ్మశాన వాటికలు, రైతు వేదికల నిర్మాణాల ఆన్‌లైన్‌ బిల్లుల అప్‌లోడింగ్‌లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామస్థాయిలో సర్పంచులు నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాల్లో పురోగతి లేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణాల్లో ఇంజినీరింగ్‌ అధికారులు అలసత్వం చేస్తూ కలెక్టర్లను ముఖ్యమంత్రి వద్ద ఇబ్బందులకు గురిచేయొద్దని ఇంజినీరింగ్‌ చీఫ్‌ సత్యనారాయణరెడ్డి హెచ్చరించారు.

మీరు పను లు చేయకపోవడం వల్ల కలెక్టర్లు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నిర్మాణ పనులను సమీక్షించారు. ఏఈలు స్థానికంగా లేకపోతే సరెండర్‌ చేయాలని, ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శివకుమార్‌ను ఆదేశించారు. నిత్యం సర్పంచులతో మాట్లాడుతూ పనులు పూర్తి చేయించాలని, ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పనుల్లో పురోగతి సాధించాలన్నారు. డిప్యూటీ సెక్రెటరీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తను కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ రైతు వేదికలను పరిశీలించడం జరిగిందని, వాటికి ఇప్పటి వరకు నిధు లు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ శివకుమార్‌, పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌ దామోదర్‌రావు, డీపీవో సురేశ్‌మోహన్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సుధాకర్‌ తదితరులు ఉన్నారు.


logo