బుధవారం 30 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 15, 2020 , 08:29:54

మట్టిమిద్దెల్లో ఉన్న వారిని ఖాళీ చేయించండి

మట్టిమిద్దెల్లో ఉన్న వారిని ఖాళీ చేయించండి

  •  సీఐ సైదులుయాదవ్‌

కల్వకుర్తి రూరల్‌ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పల్లెల్లోని పాత మట్టిమిద్దెల్లో ఉండే వారిని ఖాళీ చేయించాలని సీఐ సైదులునాయక్‌  సూచించారు. పాత మిద్దెలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తగా వారిని స్లాబ్‌ ఉన్న ఇండ్లల్లోకి తరలించాలని కల్వకుర్తి, ఊర్కొండ మండలాల్లోని సర్పంచులకు సీఐ తెలిపారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ  పాత ఇండ్లు, అందులో ఉన్నవారి వివరాలు స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో అందించాలని తెలిపారు. వర్షాలు కురుస్తున్న కారణంగా విద్యుత్‌ స్తంభాల వద్దకు, విద్యుత్‌ వైర్ల మరమ్మతు పనులకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల  రెండు మండలాల్లోని కుంటలు, చెరువులు నీటితో నిండాయని, ఈత రాని పిల్లలు వాటి వద్దకు వెళ్లకుండా ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. వాహనదారులు అటువైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ రోడ్ల ద్వారా వెళ్లాలన్నారు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే (కల్వకుర్తి సీఐ -9440795748, కల్వకుర్తి ఎస్సై -9440795715, ఊర్కొండ ఎస్సై-7901099463) నెంబర్లకు సమాచారం అందించాలని చెప్పారు.logo