బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 15, 2020 , 08:29:58

కాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయించాలి

కాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయించాలి

కల్వకుర్తి రూరల్‌ : కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామంలోని మూడు, పదకొండో వార్డులో మురుగు కాల్వ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. కాల్వల నిర్మాణం కోసం  వీధుల గుండా గుంతలు తవ్వి అలాగే వదిలి వేయడంతో మురుగు నిలిచి ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా  చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.


logo