శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 15, 2020 , 08:17:40

ధ‌ర‌ణి లెక్క‌లోనే...

ధ‌ర‌ణి లెక్క‌లోనే...

 • త్వరలో ‘భూ సమగ్ర సర్వే’ 
 • డిజిటలైజేషన్‌ కానున్న భూములు
 • రెవెన్యూ, ఫారెస్ట్‌, దేవాదాయ భూములపై స్పష్టత
 • ‘ధరణి’పోర్టల్‌తో అక్రమాలకు చెక్‌

ఇక భూ వివాదాలుండవు.. గెట్ల పంచాయితీలుండవు.. ప్లాట్ల పంచాయితీ ఉండదు.. ఆస్తి తగాదాలు తలెత్తవు.. కొనుగోళ్లు, అమ్మకాలకు ఇబ్బందులుండవు..రోజులు వారాలు వేచి చూసే పరిస్థితులుండవు.. మ్యుటేషన్‌కే మూడు నాలుగురోజులు వేచిన  రోజులకు ఇక సెలవు.. అన్నీ ఒక్క రోజులోనే.. త్వరలో భూ సమగ్ర సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. భూముల డిజిటలైజేషన్‌ చేస్తూ వివరాలన్నీ ‘ధరణి’పోర్టల్‌లో నిక్షిప్తం చేయనున్నది. అక్రమాలకు కారణమైన వీఆర్‌వో వ్యవస్థను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేయగా భూ వివరాలు డిజిటలైజేషన్‌ చేస్తుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ 


నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : 1940లో బ్రిటీష్‌ హయాంలో జరిగిన సర్వే ఆధారంగానే రా ష్ట్రంలో భూ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ని జాం కాలం నాటి రికార్డులే ప్రస్తుతం ప్రామాణికంగా మారాయి. గతంలోని భూ రికార్డులు చా లా వరకు అధికారులకు లభ్యం కావడం లేదు. ఏండ్ల తరబడిగా భద్రపర్చడం వల్ల చిరిగిపోయా యి. అక్షరాలు సైతం కనిపించకుండా, ముట్టుకుం టే చిరిగిపోయేలా ఉన్నాయి. ఈ కారణంగా భూ రికార్డుల లభ్యత, వాస్తవ పరిస్థితి, డిజిటలైజేషన్‌ క్లిష్టంగా మారింది. రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌లాంటి శాఖల మధ్య కూడా భూములపై కో ర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. 

ఒక గ్రామంలో ఉ న్న భూముల్లో ఏవి అసైన్డ్‌, ఏవి ప్రభుత్వం, ఏవి గ్రామ కంఠం అన్న భూములని తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల కల్పన కు భూసేకరణలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూముల అక్రమాలకు కారకమైన వీఆర్‌ వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. భవిష్యత్తులో భూ రికార్డుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడి తే ఉద్యోగాల నుంచి బర్తరఫ్‌ చేసేలా నూతన చ ట్టం రూపొందడం గమనార్హం. దీనివల్ల ఉద్యోగు ల్లో అక్రమాలు చేయాలనే ఆలోచనే లేకుండా ప్ర భుత్వం నిర్ణయం తీసుకొంది.  ఆధునిక పద్ధతుల తో భూ వ్యవహారాలు సులువుగా చేసేలాప్రభు త్వం స్పష్టమైన కార్యాచరణ చేపడుతున్నది. ఇం దులో భాగంగా త్వరలో భూ సమగ్ర సర్వే చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీని వల్ల భూ ముల వివాదాలు తలెత్తకుండా పారదర్శకంగా ఉండడంతోపాటు రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉంచనున్నది. 

గతంలో మాన్యువల్‌గా నిర్వహించి న పహాణీలు, 1బీ రికార్డులు, ఇతర పత్రాలు సహా భూ రికార్డుల నిర్వహణ మొత్తం ఆన్‌లైన్‌లోనే కొనసాగనున్నది. ఈ సర్వే వల్ల ఆయా భూముల వివరాలను గ్రామ స్థాయిలో ఇంచు ఇంచు పొల్లుపోకుండా డిజిటలైజ్‌ చేయనున్నారు. ఇందు లో భాగంగా గ్రామ పటాలు, టిప్పన్‌లు రూపొందుతాయి. విలేజ్‌ మ్యాప్‌ల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ను ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్‌ శాఖ వేగవంతం చేస్తోంది. తె లంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ సాయంతో జి యో రిఫరెన్స్‌ను వర్తింపజేయనున్నది. భూ వివాదాల పరిష్కారాలను కూడా గతంలో మాదిరి రెవె న్యూ కోర్టుల్లో కాకుండా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునళ్ల ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. 

ఇందులో ప్రభుత్వ భూములతో పాటు కొన్ని భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేని విధంగా ఈ పోర్టల్‌ను తయారు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న భూములకు మిం చి పాస్‌పుస్తకాల్లో నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించినా ఏమీ చేయలేకపోతున్నారు. ఇక రైతుల వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లు, స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలను ఈ పోర్టల్‌ ద్వారా వెం టనే రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. దీనికోసం మండలానికి ఒక ఐటీ నిపుణుడిని ప్రభుత్వం నియమించనున్నది. ఒకరు అమ్మిన భూమి వివరాలు క్షణంలోనే ఇతరుల పేరున రిజిష్టర్‌ అవుతాయి. ఇలా మ్యుటేషన్‌ కూడా ఒక్క రోజులోనే చేపట్టనున్నా రు. 

దీనివల్ల భూముల వ్యవహారాల్లో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకత ఉండనున్నది. ఈ పోర్టల్‌లో ఉన్న భూముల వివరాలను ప్రపంచం లో ఏ మూల నుంచైనా, ఎప్పుడైనా డౌన్‌లోడ్‌ చే సుకునేలా పక్కా కార్యాచరణ చేపడుతుండటం గ మనార్హం. ఇక ప్రభుత్వ, ఇతర నిషేధిత, వివాద భూముల వివరాలను ఆటోలాక్‌ చేయడం జరుగుతుంది. దీని వల్ల ఎవరైనా ఈ భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడాలని చూసినా వీలుకా దు.  వ్యవసాయ భూములను తాసిల్దార్లు, ఇండ్లు, స్థలాల్లాంటి ఆస్తులను రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇక రైతుల భూముల పాస్‌ పుస్తకాలను నేరుగా ఇంటికే పంపించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. త్వరలో జరగనున్న సమగ్ర సర్వేతో భూముల శాశ్వత సమస్యలు తీరనున్నాయి.

రికార్డుల రకాలు

 • పట్టాదారు పాస్‌ బుక్‌
 • డీ ఫారం పట్టా
 • లావుని పట్టా
 • టికెటి పట్టా
 • అసైన్‌మెంట్‌ సర్టిఫికెట్‌
 • రిజిష్టర్‌ దస్తావేజు
 • సాదా బైనామా లేదా 13బీ
 • 38ఇ(రక్షిత కౌలుదారు చట్టం)
 • ఇనాం భూమిపై అక్యూపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌
 • దేవాదాయ భూమిలో అనుభవం ఉన్న గిరిజనులకు ఇచ్చిన పట్టా
 • దానపత్రం
 • పార్టీషన్‌ డీడ్‌
 • భూముల రకాలు
 • పట్టా భూములు
 • ప్రభుత్వ భూములు
 • వ్యక్తిగత పట్టా
 • రాయితీ భూములు
 • ఇనాం భూములు
 • దేవాలయ భూములు
 • అటవీ భూములు
 • భూదాన్‌ భూములు
 • సీలింగ్‌ భూములు
 • కో ఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీ భూములు

శాశ్వతంగా తొలగనున్న వివాదాలు..


భూ సమగ్ర సర్వే వల్ల భూ సమస్యలు, వివాదాలు శాశ్వతంగా తొలగనున్నాయి. పలు రికార్డులు, వివిధ రకాల భూముల నమోదులో  సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా భూముల వివరాలు లభ్యం కాని పరిస్థితి ఉంది. సమగ్ర సర్వేతో పాటుగా భూముల వివరాల డిజిటలైజేషన్‌ చేయడం వల్ల భవిష్యత్‌లో భూ పంచాయతీలు శాశ్వతంగా తొలగుతాయి.

- మధుసూదన్‌నాయక్‌, డీఆర్‌వో, నాగర్‌కర్నూల్‌logo