శనివారం 26 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 11, 2020 , 07:13:39

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు రూ.41 లక్షలు

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'కు రూ.41 లక్షలు

  • మంత్రి కేటీఆర్‌కు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే మర్రి 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమం ద్వారా అంబులెన్సుల కొనుగోలుకు నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రూ.41 లక్షలు ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆయన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి చెక్కు అందజేశారు. ఇప్పటికే ఎంజేఆర్‌ ట్రస్టు ద్వారా పేద కుటుంబాల్లోని ఆడ బిడ్డలకు పెండ్లిండ్లు చేసి ప్రజల మన్ననలు పొందిన మర్రి అంబులెన్స్‌ ఏర్పాటు కోసం సాయం చేయడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి వెంట ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జీవన్‌రెడ్డి ఉన్నారు. 

అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్సీ 

కల్వకుర్తి : మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజున గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద అందించిన అంబులెన్సులను గురువారం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్‌లో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ అంబులెన్సులు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్‌ ప్రభుత్వ దవాఖానలోని 108 విభాగంలో సేవలు అందిస్తాయని చెప్పారు. 


logo