సోమవారం 28 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 07, 2020 , 08:31:33

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

కొల్లాపూర్‌ : మండలంలోని సింగోటం గ్రామంలో అనారోగ్యానికి గురైన మీదిగేరి లక్ష్మి, కౌసిక్‌కు వైద్య ఖర్చుల నిమితం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను సర్పంచ్‌ మాండ్ల కృష్ణయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ చింతకుంట శ్రీనివాసులు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. బాధితురాలు మీదిగేరి లక్ష్మికి రూ.40వేలు, కౌసిక్‌కు రూ.14వేలు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సత్యనారాయణ, వార్డు సభ్యులు కురుమూర్తి ,బాలపీరు, నాయకులు నరసింహం గౌడ్‌, మోహనాచారి పాల్గొన్నారు. తమకు వైద్యఖర్చులకు  సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు.logo