శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 04, 2020 , 07:01:11

రైతువేదిక,శ్మశానవాటికలుపూర్తి చేయాలి

రైతువేదిక,శ్మశానవాటికలుపూర్తి చేయాలి

  • అభివృద్ధి పనులుపరిశీలించిన కలెక్టర్‌ ఎల్‌ శర్మన్‌చౌహాన్‌ 
  • కొల్లాపూర్‌, కోడేరులోసుడిగాలి పర్యటన 

కొల్లాపూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదిక భవనాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలు, తడి, పొడిచెత్త షెడ్లు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలు ఈనెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ ఎల్‌ శర్మన్‌చౌహాన్‌ ఆయా గ్రా మాల సర్పంచులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ మండలంలోని వివిధ గ్రా మాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. తొలుత ఎల్లూరులో ని ర్మాణంలో ఉన్న రైతు వేదిక భవనం పనులు, వై కుంఠధామం, పల్లెవనం పనులను పరిశీలించారు. అయితే వైకుంఠధామానికి సరైన రోడ్డు లేక చెరు వు అలుగు నీటిగుండా శవాలను తీసుకువెళ్లాల్సి వస్తోందని సర్పంచ్‌ బండి లక్ష్మీదేవమ్మ కలెక్టర్‌ దృ ష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్‌ రహదారి మెరుగుపర్చేందుకు గాను రూ.50వేలు మంజూరు చే శారు.

ఈ నిధులకు తోడుగా గ్రామపంచాయతీ ని ధులు వినియోగించి చెరువు అలుగ నీటి వద్ద రహదారిని మెరుగుపర్చాలని కలెక్టర్‌ సర్పంచ్‌కు సూచించారు. నార్లాపూర్‌లో బుధవారమే రైతువేదిక భవనం నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు స ర్పంచ్‌ చిట్టెమ్మవెంకటయ్య కలెక్టర్‌కు చెప్పారు. కు డికిళ్ల, కొల్లాపూర్‌టౌన్‌, సింగవట్నం, ఎన్మన్‌బెట్ల గ్రామాల్లో జరుగుతున్న రైతువేధిక భవనాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, తదితర పనులను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తా సిల్దార్‌ ఎగ్బాల్‌, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో గంగమోహన్‌, ఎస్సై మురళీగౌడ్‌, సర్పంచులు లక్ష్మీదేవమ్మ, చిట్టెమ్మవెంకటయ్య, జ్యోతిరాము, నాగరాజు, మండ్ల కృష్ణయ్య పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి 

కోడేరు : గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌ పేర్కొన్నారు. కోడేరు, ఎత్తం, నర్సాయపల్లి, మైలారం, రాజాపూర్‌, సింగాయిపల్లి, మాచుపల్లి, తీగలపల్లి, జనుంపల్లిలో గురువారం కలెక్టర్‌ సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం 6:30 గంటలకు కోడేరుకు చేరుకున్న కలెక్టర్‌ శ్మశానవాటిక, రైతువేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడినుంచి కోడేరులోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్‌, ప్రజలను అడిగి తెలసుకున్నారు. రైతు వేదిక భవనాలు, శ్మశానవాటిక నిర్మాణాలు ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించా రు. అలాగే  హరితహారం పథకంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు.

గ్రామాల్లో పా రిశుధ్యం పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. రెండురోజుల ముందుగానే కొల్లాపూర్‌ మండలాల్లోని గ్రామాలను కలెక్టర్‌ సందర్శిస్తారని ముం దస్తు సమాచారం తెలియచేసినప్పటికీ కోడేరు మండలంలోని మైలారం, మాచుపల్లి, జనుంపల్లి వీఆర్వోలు అందుబాటులో లేకపోవడంతో వారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో శంకర్‌నాయక్‌, ఎంపీవో భద్రునాయక్‌, సర్పంచులు వెంకటస్వామి, కవిత, వరలక్ష్మీ, టీఆర్‌ఎస్‌ నాయకులు పవన్‌రెడ్డి, సురేష్‌శెట్టి, కురుమయ్య, తదితరులు పాల్గొన్నారు. logo