గురువారం 24 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 30, 2020 , 04:43:05

హరిత జిల్లాగా కృషి చేయాలి

 హరిత జిల్లాగా కృషి చేయాలి

  • ఆర్డీవో కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్‌ శర్మన్‌
  • l ఎంపీ సంతోష్‌, వనపర్తి కలెక్టర్‌ యాస్మిన్‌బాషా విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరణ

కల్వకుర్తి రూరల్‌ : మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌, వనపర్తి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా విసిరిన గ్రీన్‌ చాలెంజ్‌ను నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శర్మన్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ను హరిత జిల్లాగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. మొక్కలను నాటడంతోపాటు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్లు హన్మంత్‌రెడ్డి, మనుచౌదరిలకు మొక్కలు నాటాలంటూ గ్రీన్‌చాలెంజ్‌ విసిరారు. గ్రీన్‌ చాలెంజ్‌ ప్రతినిధి పురుషోత్తం కలెక్టర్‌ శర్మన్‌కు సర్టిఫికెట్‌ అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ రాంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, డీఎల్పీవో పండరీనాథ్‌, ఎంపీడీవో బాలచంద్రసృజన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతువేదిక నిర్మాణాల్లో వేగం పెంచాలి

రైతువేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ సూచించారు. మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. రైతు వేదిక నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. దవాఖానలో వసతులు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీలత, నాయకుడు రాజేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.logo