సోమవారం 21 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 28, 2020 , 05:37:28

విలువలు కలిగిన గొప్ప నేత ‘ఎడ్మ’

   విలువలు కలిగిన గొప్ప నేత ‘ఎడ్మ’

  •  సంస్మరణ సభలో ఎంపీలు రాములు, 
  • మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌, 
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి రూరల్‌ : కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎడ్మ కిష్టారెడ్డి గొప్ప విలువలు కలిగిన నాయకుడని, అతడి ఆశయాలు యువ నాయకులకు ఆదర్శణీయమని నాగర్‌కర్నూల్‌, పాలమూరు ఎంపీలు రాము లు,

మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలోని చింతల కొండారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కిష్టారెడ్డి సంస్మరణ సభకు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు ఆచారి, ప్రజా కవి గోరటి వెంకన్నతోపాటు రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమా ర్‌, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మల్లురవితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎడ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ లు మాట్లాడుతూ కిష్టారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు. 50 ఏండ్లుగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం శ్రమించారని గుర్తు చేసుకున్నారు.

ప్రజల కష్టాలను చూసి చలించి ఉద్యమించారని కొనియాడారు. కల్వకుర్తి ప్రాంతంలో పెద్ద మొత్తంలో సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయించి కరెంట్‌ కిష్టన్నగా పేరుగాంచారన్నారు. అనంతరం ఆచారి మాట్లాడుతూ ఎంజీకేఎల్‌ఐ డీ-82 కాల్వకు కిష్టారెడ్డి పేరును పెట్టాలని కోరారు. ఎడ్మ కుమారుడు, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యంను వారు పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌,  జెట్పీటీసీ భరత్‌ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షాహెద్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్లు తలసాని జనార్దన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 


logo