శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 26, 2020 , 03:03:14

పాఠాలు ఇంట్లోనే..

పాఠాలు ఇంట్లోనే..

162 రోజుల తరువాత..

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం దేశవ్యాప్తంగా మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటివరకు మూడు విడుతలుగా నిబంధనలను ఎ త్తివేశారు. అయినప్పటికీ స్కూళ్లు, కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. ఒక్కో విద్యాసంస్థలో వందలాది మంది విద్యార్థులు ఉండటంతో మూసి ఉంచేందుకే నిర్ణయించింది. ప్రస్తుతం సెప్టెంబర్‌ 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 162 రోజుల తర్వాత విద్యాసంవత్సరం ఆరంభం కానున్నది. ప్రతి ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి సాధారణ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. కానీ ఈ ఏడాది 1వ తేదీ నుంచి ప్రారంభం కానుండ గా.., దానితో పరిగణిస్తే 92 రోజుల తరువాత విద్యాసంస్థలు తెరుచుకున్నట్లవుతుంది. విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా పా ఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇచ్చారు. కరోనా తీవ్రత ఇంకా ఉండడంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ చేపట్టనున్నారు. కరోనాపై ఓ అంచనాకు వచ్చాక కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల మేరకు విద్యాసంస్థలకు విద్యార్థులు వచ్చే అవకాశం ఉంటుంది. 

అకాడమిక్‌ ఇయర్‌ నష్టపోకుండా..

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలకూ తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల నుంచి వరుసగా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇదే కోవలో విద్యార్థులకూ అకాడమిక్‌ ఇయర్‌ నష్టపోకుండా ప్రభుత్వం చర్య లు చేపట్టింది. ఈ క్రమంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు బోధించేందుకు మార్గాలను అ న్వేషించారు. ప్రస్తుత కాలంలో ఇంటికో స్మార్ట్‌ ఫో న్‌ సాధారణంగా మారింది. దీంతో ఆయా విద్యార్థుల సెల్‌ఫోన్‌ నెంబర్లను పాఠశాలలు, కళాశాలల్లో యాజమాన్యాలు సేకరించాయి. అనధికారికంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఈ ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతించడంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఫోన్లు లేని విద్యార్థులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించా రు. కొన్ని చోట్ల ఇంకా సేకరిస్తున్నారు. పాఠశాల ల్లో మూడో తరగతి నుంచి విద్యార్థులకు ఈ-తరగతుల బోధన ఉంటుంది. సౌ కర్యం లేని విద్యార్థులకు ఆ యా గ్రామ పంచాయ తీ కార్యాలయాల్లో టీ శాట్‌ లేదా దూరదర్శ న్‌ ద్వారా వీక్షించే స దుపాయం కల్పించనున్నారు. పాఠశాల వి ద్యార్థులకు మాత్రం రి కార్డు చేసిన పాఠాలను పంచాయతీ, కమ్యూనిటీ భవనాల్లో ప్రదర్శిస్తారు. ఇలా విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పాఠశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లతో పాటు క్లరికల్‌, ఇతర సిబ్బంది కూడా విధులకు హాజరుకావాలని రాష్ట్ర విద్యాశా ఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 27 నుంచి పాఠశాలలు, కళాశాలలకు ఉద్యోగులంతా విధిగా హాజరుకానున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లో 2847 ప్రభుత్వ పాఠశాలలు, 17 జూనియర్‌, 7 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థ లు కూడా చాలా ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో సె ప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటుండగా.., పూర్తిస్థాయి ఉత్తర్వులు వచ్చాక తరగతుల నిర్వహణపై స్పష్టత రానున్నది.


logo