శనివారం 26 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 24, 2020 , 04:54:57

‘ఎడ్మ’ మరణం తీరని లోటు

‘ఎడ్మ’ మరణం తీరని లోటు

  • మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ,విప్‌లు,డీసీసీబీ చైర్మన్‌ 

కల్వకుర్తి: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కిష్టారెడ్డి మరణం కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ పోతుగంటి రాములు, విప్‌లు గువ్వల బాలరాజు, కూచుకూళ్ల దామోదర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పాషా, శాసనమండలి సభ్యులు కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌తో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం కల్వకుర్తిలోని ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఎడ్మ కిష్టారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యానికి అన్ని వేళల్లో అండగా ఉంటానని మంత్రి తెలిపారు. నీతి నిజాయితీ కలిగిన నాయకున్ని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గోళి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ తలసాని జనార్దన్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, కూచుకూళ్ల రాజేశ్‌, రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఎడ్మ కిష్టారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

భగీరథ ప్లాంటును పరిశీలించిన మంత్రి 

 కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం అయ్యసాగర్‌లోని మిషన్‌ భగీరథ వాటర్‌ ప్లాంట్‌ను  ఆదివారం ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ తాగునీరు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన ఏపీ సీఎం

 కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, దివంగత ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూతపై ఏపీ సీఎం సంతాపం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం(ఎడ్మ కిష్టారెడ్డి తనయుడు)కు ఫోన్‌ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. ఎడ్మ కిష్టారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఎడ్మ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఏపీ సీఎం పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.logo