శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 22, 2020 , 03:51:28

పేదల పక్షపాతి ఎడ్మ కిష్టారెడ్డి

పేదల పక్షపాతి ఎడ్మ కిష్టారెడ్డి

  • మాజీ మంత్రి జానారెడ్డి
  • ఎడ్మ కుటుంబానికి పరామర్శ

కల్వకుర్తి: పేదల పక్షపాతిగా దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి జనారెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో కలిసి జానారెడ్డి శుక్రవారం పరామర్శించారు. కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డితో ఉన్న సంబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కిష్టారెడ్డి మరణం నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని జానారెడ్డి అన్నారు. మనో ధై ర్యంతో ముందుకు సాగాలని  కిష్టారెడ్డి కొడుకు, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం కు సూచించారు. కార్యక్రమంలో సీఏసీసీఎస్‌ చైర్మన్‌ తలసాని జనార్దన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షాహెద్‌తోపాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

‘ఎడ్మ’ కుటుంబానికి ఆచారి పరామర్శ

కల్వకుర్తి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కుటుంబాన్ని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు  ఆచారి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కిష్టారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియ పర్చారు. ఆయన వెంట పలువురు నాయకు లు ఉన్నారు.


logo