సోమవారం 21 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 18, 2020 , 02:47:56

బకెట్‌లోపడి బాలుడు మృతి

బకెట్‌లోపడి బాలుడు మృతి

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం): ప్రమాదవశాత్తు బకెట్‌ నీటిలో పడి బాలుడు మృతి చెందిన విషాద ఘటన శ్రీరంగాపురం మండలం నాగరాల పునరావాస గ్రామంలో సోమవారం చేసుకుంది. గ్రామానికి చెందిన కురుమూర్తి, అంజలి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మూడో సంతానమైన ఒకటిన్నర సంవత్సరాల వేణు  ఆడుకుంటూ ఇంటి ముందున్న బకెట్‌లోపడి నీటి మునిగి చనిపోయాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తాత ఎల్లస్వామి చెప్పారు. logo