శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 18, 2020 , 02:47:56

రూ.50 లక్షలు మంజూరు చేయాలి

రూ.50 లక్షలు మంజూరు చేయాలి

l ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ను కలిసిన  ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

కల్వకుర్తి : ఆమనగల్లు మండలకేంద్రంలో కొనసాగుతున్న జూనియర్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ కోరారు. సోమవారం ఆయన ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వినతికి సానుకూలంగా స్పందించిన కమిషనర్‌ ఇంటర్మీయెట్‌ బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. సంబంధిత ఫైల్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అధికారులు పంపించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.logo