గురువారం 24 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 13, 2020 , 03:32:30

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట


n ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

n రాచూర్‌ తండాలో  సీసీరోడ్డు పనులుప్రారంభం

వెల్దండ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం రాచూర్‌ తండాలో ఎమ్మెల్సీ నిధుల ద్వారా రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ప్రభుత్వ రూ.కోట్లల్లో నిధులు వెచ్చించడంతో గ్రామాలు సుందరంగా మారాయన్నారు.


దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న ఎకైక ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వమేనన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాచంద్రారెడ్డి, ఎంపీటీసీ గుత్తి వెంకటయ్య, పీఆర్‌ డీప్యూటీ ఈఈ దుర్గాప్రపాద్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, హరికిషన్‌నాయక్‌, వెంకటేశ్‌, కృష్ణ, శంకర్‌నాయక్‌, రాజు ఉన్నారు.


logo