శనివారం 26 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 13, 2020 , 03:32:30

కోఆప్షన్‌ ఎన్నిక ప్రశాంతం

కోఆప్షన్‌  ఎన్నిక ప్రశాంతం

కల్వకుర్తి రూరల్‌: పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో కోఆప్షన్‌ ఎన్నిక బుధవా రం ప్రశాంతంగా జరిగింది. బుధవారం ఉద యం 10 గంటలకు నామినేషన్ల ఉప సంహర ణ అనంతరం కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకు న్నారు. మొత్తం నాలుగు స్థానాలకు గానూ 24 నామినేషన్లు దాఖలు కాగా రెండు నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి, భాగ్యమ్మ, ఖలీల్‌, అజ్మత్‌ బేగంను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ షాహే ద్‌, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.


logo