బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 12, 2020 , 02:38:48

ఆరో నిజాం ‘షికార్‌ఘర్‌'

ఆరో నిజాం ‘షికార్‌ఘర్‌'

నిజాం నవాబులు నల్లమల ప్రాంతమైన (ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం) ఫరహాబాద్‌ అడవిలో అతిథులతో వచ్చి వన్యప్రాణులను వేటాడేవాడని చరిత్ర చెబుతున్నది. హైదరాబాద్‌ను పాలించిన 6వ నిజాం రాజు 1869లో షికార్‌ఘర్‌ అనే విడిది గృహాన్ని నిర్మించుకుని వీలుచిక్కినప్పుడల్లా ఇక్కడికి వచ్చి సేద తీరుతుండేవాడు. 1869 నుంచి 1911 వరకు ఈ గృహాన్ని ఉపయోగించినట్లు అటవీ శాఖ బోర్డును ఏర్పాటు చేసింది.. ఇటుకలు, డంగ్‌లో తిప్పిన సున్నం మట్టితో నిర్మించిన గృహం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే ఈ భవంతిని పురావస్తు, అటవీశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు.                               

  - అమ్రాబాద్‌ 


logo