సోమవారం 28 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 10, 2020 , 03:41:40

ఉమామహేశ్వరం గొప్ప క్షేత్రం

ఉమామహేశ్వరం గొప్ప క్షేత్రం

  • l కుటుంబసభ్యులతో కలిసి కలెక్టర్‌ పూజలు 

అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని ఉమామహేశ్వరం గొప్ప క్షేత్రమని కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా స్వామివారిని ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. పాపనాశనం వద్దకు వెళ్లి స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నల్లమల అటవీ ప్రాంతం అందాలు, ప్రకృతిని తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాను గతంలో నాగర్‌కర్నూల్‌ ఆర్డీవోగా, జేసీగా పనిచేసిన సందర్భంలో ఇక్కడికి వచ్చానన్నారు. అప్పటికీ, నేటికీ ఆలయ అభివృద్ధిలో మార్పు వచ్చిందన్నారు. కొన్ని అభివృద్ధి పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆలయ ఉద్యోగులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ శాంతాబాయి, రంగాపూర్‌ సర్పంచ్‌ లోక్యానాయక్‌, అర్చకులు, ఉద్యోగులు కలెక్టర్‌ను సత్కరించారు. అనంతరం రంగాపూర్‌ నిరంజన్‌షావలీ దర్గాను దర్శించుకున్నారు. కలెక్టర్‌ వెంట డీటీ పట్టాబి, ఆర్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు. logo