శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 10, 2020 , 03:40:43

మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోవాలి

మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోవాలి

  • ప్రభుత్వ వైద్యుల సేవలు అభినందనీయం
  • వీడియో కాన్ఫరెన్స్‌లో విప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్‌ : ప్రభుత్వం ముందస్తుగా మేల్కొని కరోనాను కట్టడి చేయగలిగిందని, మనోధైర్యంతో ఉంటే కొవిడ్‌ను ఎదుర్కోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వైద్యులు, సిబ్బంది, కరోనా బాధితులతో ఆదివారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాలని ప్రతి రోజూ భగవంతుడిని వేడుకుంటున్నానన్నారు. వైద్యులు, సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌, పంచాయతీ ఉద్యోగులు చేపడుతున్న చర్యలను కొనియాడారు. కాంగ్రెస్‌ నాయకులు రాజకీయ మనుగడ కోసం చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. కరోనా బారిన పడిన వారిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రమే కోలుకోలేకపోతున్నారని తెలిపారు. కరోనా సోకిన వారిలో 95 శాతానికి పైగా రోగులు ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటిస్తూ సునాయాసంగా కోలుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాల ని, బయటకు వస్తే మాస్కు లేదా, నోటి రుమాలు ధరించాలని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. 


logo