మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 10, 2020 , 03:38:13

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం

కల్వకుర్తి రూరల్‌ : చెత్తను ఇష్టానుసారంగా రోడ్లపై, మురుగుకాల్వలో వేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లోనే వేయాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని జీడిపల్లి సర్పంచ్‌ కల్పన సూచించారు. ఆదివారం గ్రామంలో తడి, పొడి చెత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం బోనాల పండుగ సందర్భంగా గ్రామంలోని వీధులను శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ గ్రామ పరిశుభ్రతకు సహకరించాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని సర్పంచ్‌ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఖాజామైనోద్దీన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.logo